నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాకి ‘రూలర్’ అని టైటిల్ పెట్టినట్లు తెలుస్తోంది. అయితే చిత్రబృందం నుండి ఈ టైటిల్ ఫైనల్ చేసినట్లు ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.
కాగా తమిళ సీనియర్ హీరో శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మి ఈ చిత్రంలో విలన్ రోల్ లో నటించబోతున్నారట. అలాగే విలక్షణ నటుడు జగపతిబాబు కూడా ఈ చిత్రంలో పవర్ ఫుల్ విలన్ గా నటించబోతున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు చిరంతన్ భట్ సంగీత సారథ్యం వహిస్తున్నారు. సి.కె.ఎంటర్ టైన్మెంట్స్ అధినేత సి.కల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
`జైసింహా` వంటి సూపర్ డూపర్ హిట్ తర్వాత ఈ హిట్ కాంబినేషన్ లో రూపొందనున్న చిత్రమిది. మే 17న ఈ సినిమా లాంఛనంగా ప్రారంభం అవుతుంది. అలాగే జూన్ నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది.