
నట సింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ‘లయన్’ సినిమా షూటింగ్ లో బిజీ బిజీగా ఉన్నాడు. ఈ పవర్ఫుల్ యాక్షన్ డ్రామాలో బాలకృష్ణ రెండు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించనున్న సంగతి మేము ఇది వరకే తెలియజేశాం. అందులో ఓ పాత్రలో బాలకృష్ణ స్ట్రిక్ట్ సిబిఐ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. తాజాగా ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్న సమాచారం ప్రకారం బాలకృష్ణ సిబిఐ పాత్ర రియర్ అండ్ స్ట్రిక్ట్ ఆఫీసర్ అయిన జెడి లక్ష్మీ నారాయణ లైఫ్ ని ప్రతిబింబించేలా ఉంటుందని అటున్నారు. లక్ష్మీ నారాయణ స్ఫూర్తితోనే డైరెక్టర్ ఈ పాత్ర రాసుకున్నట్లు సమాచారం.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరబాద్ లో జరుగుతోంది. ఈ సినిమా కోసం వేసిన ఓ స్పెషల్ పోలీస్ స్టేషన్ సెట్ లో బాలకృష్ణ పై కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. న్యూ ఇయర్ కానుకగా ఫస్ట్ టీజర్ రూపంలో నందమూరి బాలకృష్ణ తన ‘లయన్’ సినిమా ఎలా ఉంటుందా అనేది అభిమానులకు కాస్త సాంపిల్ చూపించాడు. బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో త్రిష, రాధిక ఆప్టే హీరోయిన్స్ గా కనిపించనున్నారు. సత్యదేవా దర్శకుడుగా పరిచయమవుతూ చేసిన ఈ సినిమాకి రుద్రపాటి రమణారావు నిర్మాత. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని మార్చి చివర్లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.