చిరుతో సినిమాపై బాలయ్య క్రేజీ కామెంట్స్ వైరల్.!

చిరుతో సినిమాపై బాలయ్య క్రేజీ కామెంట్స్ వైరల్.!

Published on Dec 1, 2022 4:03 PM IST

మన టాలీవుడ్ లో ఉన్నటువంటి ఒకవేళ వస్తే సెన్సేషనల్ మల్టీ స్టారర్స్ ఏవన్నా ఉన్నాయి అంటే అది ఒకటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు లది కాగా మన సీనియర్ స్టార్స్ లో అయితే మెగాస్టార్ చిరంజీవి మరియు నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ లతో చేసే సినిమాలే అని చెప్పొచ్చు.

మరి ఈ రెండు ఎప్పుడు అవుతాయో కానీ బాలయ్య మాత్రం చిరు తో సినిమా కోసం లేటెస్ట్ గా తన టాక్ షో “అన్ స్టాప్పబుల్ 2” లో క్రేజ్య్ కామెంట్స్ చేశారు. లేటెస్ట్ ఎపిసోడ్ కి దిగ్గజ నిర్మాతలు అల్లు అరవింద్ మరియు సురేష్ బాబులు రాగా అల్లు అరవింద్ కి వేసిన ప్రశ్నలో తాను అయితే మల్టీ స్టారర్ తీస్తే మీతోని అలాగే చిరంజీవి గారితో తీయాలి అనుకుంటున్నాను అని అన్నారు.

మరి దానికి బాలయ్య బదులిస్తే “మేమిద్దరం చేస్తే అది ఇక పాన్ వరల్డ్ సినిమానే” అంటూ అదిరే కామెంట్స్ చేశారు. మరి ఈ సెన్సేషనల్ కాంబో ఎంతవరకు నిజం అవుతుందో కానీ ఈ కామెంట్స్ మాత్రం ఇద్దరి ఫ్యాన్స్ లో మంచి ఎగ్జైట్మెంట్ ని తీసుకొచ్చాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు