లేటెస్ట్ : కృష్ణ గారి మరణం పట్ల బాలయ్య భావోద్వేగం.!

లేటెస్ట్ : కృష్ణ గారి మరణం పట్ల బాలయ్య భావోద్వేగం.!

Published on Nov 15, 2022 10:05 AM IST

ఈరోజు ఉదయం కావస్తూనే తెలుగు చలన చిత్ర పరిశ్రమ దగ్గర ఓ మహా శిఖరం అస్తమించిన వార్త వినాల్సి వచ్చింది. లెజెండరీ హీరో సూపర్ స్టార్ కృష్ణ గారు ఇక లేరు అనే వార్త సినీ ప్రపంచంలో ఓ తీరని లోటుగా మారగా వారి అకాల మరణంతో ఇండియన్ సినిమా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది. అయితే తాజాగా ప్రముఖ నటులు నందమూరి నటసింహ నందమూరి బాలకృష్ణ, ఈ విషాద ఘటనపై స్పందించారు.

“ఘట్టమనేని కృష్ణ గారి మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. కృష్ణ గారు తన నటనతో చిత్రసీమలో సరికొత్త ఒరవళ్ళు సృష్టించి ఎనలేని ఖ్యాతి సంపాదించి ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా స్టూడియో అధినేతగా చిత్ర పరిశ్రమకు ఆయన అందించిన సేవలు మరువలేనివి. కృష్ణగారితో మా కుటుంబానికి ఎంతో అనుబంధం వుంది. నాన్నగారు, కృష్ణ గారు కలసి అనేక చిత్రాలకు పని చేశారు.

ఆయనతో కలిసి నేను నటించడం మర్చిపోలేని అనుభూతి. కృష్ణ గారు లేనిలోటు సినీ పరిశ్రమకూ, అభిమానులకు ఎప్పటికీ తీరనిది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను. ఇటివలే సోదరుడు రమేష్ బాబుని, మాతృమూర్తి ఇందిరాదేవిని కోల్పోయి దుఖంలో వున్న నా సోదరుడు మహేష్ బాబుకు ఈ కష్టం కాలంలో దేవుడు మనో ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ.. ఆయన కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను” అని బాలయ్య భావోద్వేగ పోస్ట్ ద్వారా అయితే తన స్పందనను పంచుకున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు