బాలయ్య షో..ఫస్ట్ ఎపిసోడ్ వారితో.?

Published on Oct 26, 2021 6:04 pm IST


నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ అండ్ మోస్ట్ అవైటెడ్ సినిమా “అఖండ” రిలీజ్ డేట్ క్లారిటీ ఏమో కానీ దాని కన్నా ముందే అయితే ఓటిటి వీక్షకులకు అదిరే ట్రీట్ ఇవ్వడానికి సిద్ధం అయ్యిపోయారు బాలయ్య. తెలుగు మొదటి స్ట్రీమింగ్ యాప్ “ఆహా” లో అదిరే షో “అన్ స్టాప్పబుల్” అనే టాక్ షో తో బాలయ్య మొట్టమొదటిగా ఓటిటికి పరిచయం అవుతుండడంతో ఈ షో పై ప్రత్యేక అంచనాలు నెలకొన్నాయి.

మరి ఇదిలా ఉండగా ఒక 14 ఎపిసోడ్స్ గా ప్లాన్ చేసిన ఈ షో లో మొదటి ఎపిసోడ్ పై బజ్ వినిపిస్తుంది. దీని ప్రకారం ఈ ఎపిసోడ్ మంచు మోహన్ బాబుతో స్టార్ట్ చేసినట్టుగా వినిపిస్తుంది. అయితే ఇది ప్రీమియర్ గా స్ట్రీమింగ్ కు తీసుకొస్తారా లేక వేరే ఎపిసోడ్ ఏమన్నా ఉందా అనేది తెలియాల్సి ఉంది. ఓవరాల్ గా అయితే ఈ షో పై మంచి అంచనాలు ఉన్నాయి ముఖ్యంగా బాలయ్య హోస్టింగ్ కోసం అయితే అంతా ఆసక్తిగా చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :