తాతయ్య కాబోతున్న నందమూరి బాలయ్య

balakrishna
నందమూరి బాలకృష్ణ ఇంట పండుగ వాతావరణం నెలకొంది. త్వరలో బాలయ్య తాతయ్య కాబోతున్నారు. వచ్చే ఏడాది బాలయ్య ఇంట్లో చిట్టి చిన్నారి అడుగుపెట్టబోతుంది. చంద్రబాబు కుమారుడు నారా లోకేష్, బాలయ్య పెద్ద కుమార్తె బ్రాహ్మణిల వివాహం 2007లో జరిగిన సంగతి తెలిసిందే. ఈ దంపతులు త్వరలో అమ్మానాన్నలు కాబోతున్నట్లు వైద్యులు దృవీకరించారు.

ఇటివలే చిత్రసీమలో ప్రవేసించే 40 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా బాలకృష్ణ ఇచ్చిన ఇంటర్వ్యూలో నిజ జీవితంలో తాత పాత్ర కోసం ఎదురు చూస్తున్నాను. మనుమలు, మనుమరాళ్ళతో ఆడుకోవాలని ఉంది అని చెప్పారు.

విజయవంతమైన హీరోగా, ఆదర్శవంతమైన తండ్రిగా, ప్రజా శ్రేయస్సు కోరే రాజకీయ నాయకుడిగా ఇలా నిజ జీవితంలో విభిన్న పాత్రలను సమర్దవంతంగా పోషిస్తున్న బాలకృష్ణ తాతయ్య కావడంతో సంతోషంగా ఉన్నారు.

Exit mobile version