బాలయ్య బంగారు హృదయం..చిన్నారికి ఆయువు పోసిన వైనం!

Published on Sep 19, 2021 4:53 pm IST


నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ ఒక్క వెండితెర మీదనే కాకుండా నిజజీవితంలో కూడా హీరోనే అని చాలా మందికి తెలుసు. ముఖ్యంగా ఎవరైనా అనారోగ్యంతో ఉన్నారు అందులోని చిన్న పిల్లలు అంటే బాలయ్య హృదయం కదలిపోతుంది. అలా ఇప్పటి వరకు ఎంతమందికి సాయం చేసిన బాలయ్య బంగారు హృదయానికి నిదర్శనంగా మరో కీలక సంఘటన తాజాగా చోటు చేసుకుంది.

ఇప్పటికే బాలయ్య తన బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రితో ఎందరో ప్రాణాలను కాపాడిన వారయ్యారు. ఇక వివరాల్లోకి వెళితే మల్కాజ్ గిరి ప్రాంతానికి చెందిన మణిశ్రీ అనే చిన్నారి గత కొన్నాళ్ల కితమే క్యాన్సర్ వ్యాధితో బాధ పడుతూ బసవతారకం ఆసుపత్రిలో అడ్మిట్ అవ్వడం జరిగింది. మరి ఈ ఆపరేషన్ కి గాను సుమారు 7 లక్షలు ఖర్చు అవ్వనుండగా దాతల నుంచి ఎంత సాయం వచ్చినప్పటికీ 5 లక్షలకు పైగానే ఇంకా బ్యాలన్స్ ఉండిపోయింది.

మరి దీనితో చిన్నారి తల్లిదండ్రులు బాలయ్య అభిమాన సంఘం అధ్యక్షుడిని కలిసి పరిస్థితి వివరించగా వారు ఈ విషయాన్ని బాలయ్యకు చేరవేశారు. దీనితో విషయం తెలిసిన బాలయ్య ఆ మిగతా 5 లక్షల 20 వేలు కి ఎలాంటి రుసుము చెల్లించవద్దని దానిని మాఫీ చేసి ఆపరేషన్ చేయించి చిన్నారికి ఆయువు పోశారు. దీనితో ఈ సంఘటన బయటకి రావడంతో బాలయ్య ఉదారత మరోసారి బయల్పడింది.

సంబంధిత సమాచారం :