నందమూరి మరో యంగ్ హీరో – ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన బాలయ్య.!

Published on May 28, 2022 5:24 pm IST

ఈరోజు నందమూరి కుటుంబానికి అలాగే దశాబ్దాల కాలం నుంచి వారి వెన్నంటే నిలబడి ఉన్న అభిమానులకి పర్వదినం అని చెప్పాలి. తెలుగు సినిమా దగ్గర చిరస్థాయిగా నిలిచిపోయే సినీ సామ్రాజ్యాన్ని నెలకొల్పిన నందమూరి తారక రామారావు 100 జయంతి సందర్భంగా నందమూరి కుటుంబంలో ఈ రోజును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

అయితే ఈ స్పెషల్ డే నే నందమూరి కుటుంబం నుంచి మరో యంగ్ హీరో టాలీవుడ్ కి పరిచయం అయ్యాడు. బసవ తారక రామారావు ఆర్ట్స్ లో మొట్టమొదటి సినిమాగా హీరో నందమూరి చైతన్య కృష్ణ ని పరిచయం చేస్తూ సినిమా తాలూకా ఇంటెన్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని బాలయ్య రీవెల్ చేశారు. మరి ఈ చిత్రాన్ని “రక్ష”, “జక్కన్న” ఫేమ్ దర్శకుడు ఆకెళ్ళ వంశీ కృష్ణ తెరకెక్కిస్తుండగా రానున్న రోజుల్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ని రివీల్ చేస్తామని తెలిపారు.

సంబంధిత సమాచారం :