‘శ్రీలీల’ తో ఎమోషనల్ ట్రాక్ స్టార్ట్ చేయనున్న బాలయ్య !

‘శ్రీలీల’ తో ఎమోషనల్ ట్రాక్ స్టార్ట్ చేయనున్న బాలయ్య !

Published on Nov 20, 2022 6:41 PM IST

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రస్తుతం బాలయ్య బాబుతో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ 8వ తేదీన పూజా కార్యక్రమాలతో స్టార్ట్ కానుంది. కాగా మొదటి షెడ్యూల్ లో శ్రీలీల – బాలయ్య కాంబినేషన్ లో వచ్చే ఓ ఎమోషనల్ ట్రాక్ ను షూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సీన్స్ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ముమ్మరంగా జరుగుతుందట.

అనిల్ రావిపూడి క్యాస్టింగ్ ను కూడా ఫైనల్ చేసుకుంటున్నాడు. ముఖ్యంగా బాలయ్యకి విలన్ పాత్ర కోసం బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ను తీసుకున్నారు. ఏది ఏమైనా తనదైన మార్క్ టైమింగ్ తో, తన మార్క్ డైలాగ్ లతో వరుస విజయాలను అందుకుంటున్నాడు అనిల్ రావిపూడి. అందుకే, అనిల్ – బాలయ్య కలయికలో సినిమా అనగానే ఈ సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు