బాలయ్య – కళ్యాణ్ రామ్ కాంబినేషన్ .. నిజమేనా?

Published on Mar 14, 2022 11:49 pm IST

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి వరుస సక్సెస్ లతో ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. అయితే, ఈ టాలెంటెడ్ డైరెక్టర్ బాలయ్య బాబుతో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ తెలిసింది. ఈ సినిమా మల్టీస్టారర్ అని, సినిమాలో మరో హీరో కూడా నటిస్తున్నాడని.. ఆ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ అని తెలుస్తోంది. అనిల్ రావిపూడికి మొదటి డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చింది కళ్యాణ్ రామే.

ఎప్పటి నుంచో కళ్యాణ్ రామ్ తో మరో సినిమా చేయాలని అనిల్ రావిపూడి అనుకుంటున్నాడు. కానీ.. కొన్ని కారణాల వల్ల ఈ కాంబినేషన్ సెట్ కాలేదు. ఇప్పుడు బాలయ్యతో కళ్యాణ్ రామ్ ఒక సినిమా చేస్తున్నాడు. కాబట్టి.. బాలయ్య – కళ్యాణ్ రామ్ కాంబినేషన్ ను సెట్ చేసే ఆలోచనలో అనిల్ ఉన్నాడట. అయితే, ఈ కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్తుందో లేదో చూడాలి. ఇక ఈ సినిమాలో కామెడీ డోస్ బాగా ఉంటుందని, అయితే ఈ సినిమా పూర్తి ఎంటర్‌టైనర్‌ గా ఉన్నా.. బాలయ్య శైలిలో సీరియస్ యాక్షన్ డ్రామా కూడా అంతే స్థాయిలో ఉంటుందని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :