ట్రెండింగ్ గా మారిన బాలయ్య పేరు, నయా డాషింగ్ లుక్స్..!

ట్రెండింగ్ గా మారిన బాలయ్య పేరు, నయా డాషింగ్ లుక్స్..!

Published on Aug 14, 2022 12:58 PM IST

ప్రస్తుతం నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు గోపీచంద్ మలినేనితో ప్లాన్ చేసిన సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ కోసం అందరికీ తెలిసిందే. మరి బాలయ్య కెరీర్ లో 107వ సినిమాగా ప్లాన్ చేసిన ఈ సినిమా శరవేగంగా తెరకెక్కుతుంది. అయితే ఈ సినిమాలో బాలయ్య లుక్స్ మాత్రం ఎప్పటికప్పుడు వింటేజ్ బాలయ్యని గుర్తు చేస్తూ మొదటి నుంచి కూడా ఫ్యాన్స్ కి మూవీ లవర్స్ కి ఒక ట్రీట్ లా మారాయి.

ఇక లేటెస్ట్ గా అయితే కళ్యాణ్ రామ్ “బింబిసార” స్పెషల్ షో కి వచ్చిన విజువల్స్ వైరల్ గా మారగా ఇందులో బాలయ్య లేటెస్ట్ మేకోవర్ మరింత ఆసక్తిగా కనిపిస్తుంది. ఆ షర్ట్ స్టైలింగ్ అన్నీ మంచి డాషింగ్ గా బాలయ్య కనిపిస్తున్నారు. దీనితో అయితే మళ్ళీ ఈ కొత్త లుక్స్ సహా ట్విట్టర్ ట్రెండ్స్ తో బాలయ్య పేరు వైరల్ గా మారాయి. అలాగే సినిమాపై మరిన్ని అంచనాలు పెరుగుతున్నాయి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు