లేటెస్ట్..క్రాస్ రోడ్స్ లో బాలయ్య లేటెస్ట్ సాంగ్ రిలీజ్.!

లేటెస్ట్..క్రాస్ రోడ్స్ లో బాలయ్య లేటెస్ట్ సాంగ్ రిలీజ్.!

Published on Dec 24, 2022 11:00 AM IST

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న సాలిడ్ చిత్రం “వీర సింహా రెడ్డి” కోసం తెలిసిందే. హిట్ దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న ఈ క్రేజీ ఫ్యాక్షన్ డ్రామాపై భారీ అంచనాలు నెలకొనగా శృతి హాసన్ అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ చిత్రం అటు యాక్షన్ పరంగా ఇటు మ్యూజికల్ గా కూడా సాలిడ్ హైప్ పెంచుకుంటూ వస్తుంది.

అలా థమన్ ఇచ్చిన పాటల్లో ఆల్రెడీ రెండూ కూడా సాలిడ్ హిట్ కాగా ఇప్పుడు సినిమాలో ఐటెం నెంబర్ మా బావ మనోభావాలు అనే సాంగ్ ప్రోమో నిన్న రిలీజ్ చేయగా దీనికి క్రేజీ రెస్పాన్స్ కూడా వచ్చింది. ఇక ఇప్పుడు అయితే మేకర్స్ లేటెస్ట్ గా ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు.

ఈరోజు ఈ సాంగ్ హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో సంధ్య 35 ఎం ఎం థియేటర్ లో మధ్యాహ్నం 2 గంటలకే లాంచ్ చేయబోతున్నట్టుగా తెలిపారు. దీనితో ఆల్రెడీ అక్కడ హంగామా మొదలైనట్టుగా తెలుస్తుంది. మరి సినిమాకి అయితే సరికొత్త ప్రమోషన్స్ తో మేకర్స్ అదరగొడుతున్నారు. ఇక ఆన్ లైన్ లో 3 గంటలకి వచ్చే ఈ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు