టాక్..మరో సాలిడ్ ప్రాజెక్ట్ తో బాలయ్య.?

టాక్..మరో సాలిడ్ ప్రాజెక్ట్ తో బాలయ్య.?

Published on Feb 1, 2023 2:00 AM IST

ప్రస్తుతం నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన సాలిడ్ హిట్ చిత్రం “వీరసింహా రెడ్డి” భారీ హిట్ అయ్యిన సంగతి తెలిసిందే. దీనితో తన కెరీర్ లో మరో సూపర్ హిట్ ని ఖాతాలో వేసుకోగా నెక్స్ట్ కూడా మరింత ఇంట్రెస్టింగ్ లైనప్ తో బాలయ్య సంసిద్ధం అవుతున్నారు. మరి ఇదిలా ఉండగా మరో ఆసక్తికర బజ్ బాలయ్య లైనప్ పై అయితే వినిపిస్తుంది.

దీని ప్రకారం అయితే బాలయ్య యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు అయినటువంటి ప్రశాంత్ వర్మ తో అయితే ఓ సినిమా చేసే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి దీనిపై ఇంకా అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో బాలయ్య ప్రస్తుతం అన్ స్టాప్పబుల్ అనే టాక్ షో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ కాంబినేషన్ లో సినిమా అంటే ఎలా ఉంటుందో చూడాలి. ఆల్రెడీ ప్రశాంత్ వర్మ తన సినిమాల్లో డిఫరెంట్ జానర్స్ తో సత్తా ప్రూవ్ చేసుకున్నాడు మరి ఈ కాంబో లో సినిమా ఉందో లేదో కాలమే నిర్ణయించాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు