మహేష్ పై బాలయ్య ఆసక్తికర ‘మాట’ వైరల్..!

Published on Feb 5, 2022 3:06 pm IST


ప్రస్తుతం నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ తన సినిమాలు పాలిటిక్స్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మరి దీనికి ముందే తన గ్రాండ్ ఓటిటి షో “అన్ స్టాప్పబుల్” సీజన్ 1 ని కంప్లీట్ చేశారు. అయితే ఓటిటి లోకి ఎంట్రీ ఇవ్వడమే ఒక బ్లాస్ట్ తో ఇచ్చారని చెప్పాలి.

తెలుగు నుంచే కాకుండా ఇండియా లోనే ఒక హిట్ టాక్ షో గా దీనిని బాలయ్య సెట్ చేసి పెట్టేసారు. మరి ఇదిలా ఉండగా ఈ గ్రాండ్ కి మరింత గ్రాండియర్ ని ఇస్తున్నట్టుగా మన టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరైన సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సీజన్ ఫైనల్ ఎపిసోడ్ కి గాను హాజరు అయ్యారు.

అయితే మోస్ట్ ఎంటర్టైనింగ్ గా సాగిన ఈ ఎపిసోడ్ లో మహేష్ బాబు పై బాలయ్య చెప్పిన ఒక ‘మాట’ సర్వత్రా ఆసక్తిగా మారింది. మరి ఇంతకీ బాలయ్య ఏమన్నారంటే నువ్వు కేవలం నటుడివి మాత్రమే కాదని ఒక తరాన్ని ముందుకు తీసుకెళ్లే మార్గదర్శివి అని తెలిపారు. దీనితో ఈ మాట మంచి వైరల్ అవుతుంది. అలాగే మహేష్ అభిమానులు అయితే మరింత ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :