బాలయ్య కొత్త సినిమా.. దసరాకి లాంచ్, సంక్రాంతికి రిలీజ్ !

Published on Jul 11, 2022 11:00 pm IST

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య బాబు హీరో ఓ పక్కా యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్ టైనర్ రాబోతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాని దసరాకి లాంచ్ చేసి.. వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ముప్పై ఏళ్ల వయసులో ఆవేశంలో చేసిన గొడవల కారణంగా హీరోకి 14 ఏళ్లు శిక్ష పడుతుందట. జైలు నుంచి విడుదలైన హీరో జీవితంలో చోటు చేసుకునే సంఘటనలు చాలా కామెడీగా సాగుతాయని.. సినిమాలో లవ్ ట్రాక్ కూడా ఫుల్ ఎంటర్ టైన్ గా ఉంటుందని తెలుస్తోంది.

అలాగే ప్లాష్ బ్యాక్ చాలా వైల్డ్ గా ఉంటుందట. ఇక ఈ సినిమా మల్టీస్టారర్ అని, సినిమాలో మరో హీరో కూడా నటిస్తున్నాడని.. ఆ హీరో రవితేజ అని తెలుస్తోంది. అనిల్ రావిపూడి ఇప్పటికే రవితేజతో ఒక సినిమా చేశాడు. ఇప్పుడు బాలయ్యతో రవితేజను కలిపి మరో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. మరి.. బాలయ్య – రవితేజ కాంబినేషన్ అదిరిపోతోంది. అందుకే ఈ కలయికను సెట్ చేసే ఆలోచనలో ఉన్నాడు అనిల్. అయితే, ఈ కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్తుందో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :