వెంకీ కుడుముల తో బాలయ్య ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ?

వెంకీ కుడుముల తో బాలయ్య ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ?

Published on Oct 25, 2022 8:00 AM IST

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య బాబు హీరోగా ఓ పక్కా యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్ టైనర్ రాబోతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా తర్వాత చిత్రాన్ని కూడా బాలయ్య దాదాపు ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ కుడుముల తో ఓ సినిమా చేయడానికి బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా సినిమాని చూసే విధంగా వెంకీ కుడుముల సినిమాలు ఉంటాయి.

అలాంటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ను చేయాలని బాలయ్య ప్లాన్ చేస్తున్నాడు. ఈ క్రమంలో వెంకీ కుడుముల సినిమాలు బాలయ్యకి బాగా నచ్చాయట. అందుకే బాలయ్య ఛాన్స్ ఇచ్చాడని తెలుస్తోంది. అయితే, వెంకీ కుడుముల, మెగాస్టార్ తో సినిమా ప్లాన్ చేస్తున్నాడని ఆ మధ్య వార్తలు వచ్చాయి. కానీ అంతలో బాలయ్య – వెంకీ కుడుముల కాంబినేషన్ తెర పైకి వచ్చింది. మరోవైపు ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య సినిమా చేస్తున్నాడు. వచ్చే నెలలో అనిల్ రావిపూడి సినిమాని కూడా బాలయ్య స్టార్ట్ చేసేలా ఉన్నాడు. మొత్తానికి బాలయ్య ఫుల్ ఫామ్ లో ఉన్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు