బింబిసార డైరెక్టర్ తో బాలయ్య కొత్త సినిమా ఫిక్స్?

బింబిసార డైరెక్టర్ తో బాలయ్య కొత్త సినిమా ఫిక్స్?

Published on Aug 15, 2022 7:00 AM IST

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య బాబు హీరోగా ఓ పక్కా యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్ టైనర్ రాబోతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా తర్వాత చిత్రాన్ని కూడా బాలయ్య దాదాపు ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. బింబిసార దర్శకుడు వశిష్ట తో ఓ సినిమా చేయడానికి బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఫ్యామిలీతో కలిసి బింబిసార చిత్రాన్ని చూసిన బాలయ్యకి సినిమా బాగా నచ్చిందట. పైగా వశిష్ట బాలయ్య అభిమాని. అందుకే బాలయ్య ఛాన్స్ ఇచ్చాడని తెలుస్తోంది.

ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య సినిమా చేస్తున్నాడు. వచ్చే నెలలో అనిల్ రావిపూడి సినిమాని కూడా బాలయ్య స్టార్ట్ చేసేలా ఉన్నాడు. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ముప్పై ఏళ్ల వయసులో ఆవేశంలో చేసిన గొడవల కారణంగా హీరోకి 14 ఏళ్లు శిక్ష పడుతుందట. జైలు నుంచి విడుదలైన హీరో జీవితంలో చోటు చేసుకునే సంఘటనలు చాలా కామెడీగా సాగుతాయని.. సినిమాలో లవ్ ట్రాక్ కూడా ఫుల్ ఎంటర్ టైన్ గా ఉంటుందని తెలుస్తోంది. అలాగే ప్లాష్ బ్యాక్ చాలా వైల్డ్ గా ఉంటుందట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు