బాలయ్య – రవితేజ కాంబినేషన్ .. సెట్స్ పైకి వెళ్తుందా ?

బాలయ్య – రవితేజ కాంబినేషన్ .. సెట్స్ పైకి వెళ్తుందా ?

Published on Feb 1, 2022 5:55 PM IST

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి వరుస సక్సెస్ లతో ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. అయితే, ఈ టాలెంటెడ్ డైరెక్టర్ బాలయ్య బాబుతో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ తెలిసింది. ఈ సినిమా మల్టీస్టారర్ అని తెలుస్తోంది. ఈ సినిమాలో మరో హీరో కూడా నటిస్తున్నాడని.. ఆ హీరో రవితేజ నాయి తెలుస్తోంది. బాలయ్య – రవితేజ కాంబినేషన్ నిజంగా బాగుంటుంది.

అయితే, ఈ కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్తుందో లేదో చూడాలి. ఇక ఈ సినిమాలో కామెడీ డోస్ బాగా ఉంటుందని, అయితే ఈ సినిమా పూర్తి ఎంటర్‌టైనర్‌ గా ఉన్నా.. బాలయ్య శైలిలో సీరియస్ యాక్షన్ డ్రామా కూడా అంతే స్థాయిలో ఉంటుందని తెలుస్తోంది. అలాగే బాలయ్య ను కొత్త తరహాలో చూపించబోతున్నారట. ఈ ఏడాది జూలై నుంచి షూటింగ్ స్టార్ట్ చేయాలని అనిల్ రావిపూడి ప్లాన్ చేస్తున్నాడు.

మొత్తానికి తనదైన మార్క్ టైమింగ్ తో, తన మార్క్ డైలాగ్ లతో, వరుస విజయాలను అందుకుంటున్న అనిల్ రావిపూడికి ఫుల్ డిమాండ్ ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు