బాలయ్య మాస్ సినిమా రిలీజ్ ఆ నెల లోనే..!

Published on Jun 29, 2022 3:05 pm IST

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ మాస్ సినిమా కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు గోపీచంద్ మలినేనితో చేస్తున్న ఈ చిత్రం భారీ యాక్షన్ మరియు మాస్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం బాలయ్య కెరీర్ లో 107వ సినిమాగా వస్తుంది.

మరి భారీ అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రాన్ని మేకర్స్ శరవేగంగా తెరకెక్కిస్తున్న ఇప్పుడు బాలయ్యకు కరోనా రావడంతో చిన్నపాటి బ్రేక్ తీసుకుంది. మరి నెక్స్ట్ షెడ్యూల్ ని అయితే వచ్చే వారం నుంచే ప్లాన్ చేస్తున్నట్టు బజ్ రాగా సినిమా రిలీజ్ పై కూడా లేటెస్ట్ గా మరింత స్ట్రాంగ్ బజ్ వినిపిస్తుంది.

ఈ చిత్రాన్ని ఆల్ మోస్ట్ డిసెంబర్ నెలలోనే రిలీజ్ చెయ్యాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారట. అది కూడా మొదటి వారం లోనే ఉంటుంది అని టాక్. మరి మళ్ళీ అఖండ రిజల్ట్ రిపీట్ అవుతుందేమో చూడాల్సిందే. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :