లేటెస్ట్..సెన్సార్ కంప్లీట్ చేసుకున్న బాలయ్య “అఖండ”.!

Published on Nov 21, 2021 12:00 pm IST

ప్రస్తుతం నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా మాస్ దర్శకుడు బోయప్తతి శ్రీను తెరకెక్కించిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “అఖండ”. ఎప్పుడు నుంచో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ సినిమా “అఖండ”. అనేక అంచనాలు ఉన్న ఈ చిత్రాన్ని దర్శకుడు రిలీజ్ కి రెడీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మేకర్స్ సెన్సార్ పనులను ముగించేసింది..

బోయపాటి అన్ని సినిమాలుకు కూడా వచ్చే సెన్సార్ సర్టిఫికెట్ నే ఈ చిత్రానికి సెన్సార్ యూనిట్ అందించారు. ఈ సినిమా యూ/ ఏ సర్టిఫికెట్ ను తెచ్చుకుని డిసెంబెర్ 2 న ప్రపంచ వ్యాప్తంగా బాలయ్య కెరీర్ లోనే భారీ ఎత్తున రిలీజ్ అవుతుంది. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందివ్వగా ద్వారకా క్రియేషన్స్ వారు నిర్మాణం అందించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :

More