200 కోట్లతో బాలయ్య “అఖండ” సెన్సేషన్..!

Published on Jan 20, 2022 12:00 pm IST

నందమయూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ భారీ సినిమా “అఖండ” చిత్రం ఈరోజుతో 50 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే ఈ చిత్రం 100 కి పైగా సెంటర్స్ లో 50 రోజులు పూర్తి చేసుకొని దుమ్ము లేపింది. దర్శకుడు బోయపాటి శ్రీను, బాలయ్య కాంబో అంటే ఉండే అంచనాలు అన్నిటినీ మించి ఈ చిత్రం సాలిడ్ హిట్ అయ్యింది.

ఇక ఈరోజు 50 రోజులు కంప్లీట్ చేసుకుంటుండడం రేపు ఓటిటి లో రిలీజ్ అవుతుండడం జరగనున్న సందర్భంలో మేకర్స్ ఈ సినిమా పై ఇంట్రెస్టింగ్ అంశాన్ని రివీల్ చేశారు. ఈ చిత్రం టోటల్ గా 200 కోట్ల క్లబ్ లో చేరిందట. థియేట్రికల్ గా ఆల్రెడీ ఈ సినిమా 150 కోట్ల గ్రాస్ మార్క్ ని క్రాస్ చేసిన సంగతి తెలిసిందే.

మరి మిగతా 50 కోట్లను నాన్ థియేట్రికల్ గా అందుకుని టోటల్ గా ఈ చిత్రం 200 కోట్ల క్లబ్ లో నిలిచినట్టు తెలిపారు. దీనితో ఏఈ రకంగా బాలయ్య మొట్టమొదటి సారిగా 200 కోట్ల క్లబ్ లో ఎంటర్ అయ్యారు. ఇక ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించగా థమన్ మైండ్ బ్లోయింగ్ మ్యూజిక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అలాగే ద్వారకా క్రియేషన్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :