ఓవర్సీస్ లో బాలయ్య హవా..మిలియన్ మార్క్ టచ్ చేసిన “అఖండ”

Published on Dec 14, 2021 9:00 am IST

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కించిన భారీ హ్యాట్రిక్ మాస్ చిత్రం “అఖండ”. సినిమా అనౌన్సమెంట్ నాటి నుంచే భారీ అంచనాలు నెలకొల్పుకొని నందమూరి అభిమానులు సహా మాస్ ఆడియెన్స్ లో క్రేజీ చిత్రంగా ఇది నిలిచింది.

ఎట్టకేలకు పలు డేట్స్ అనంతరం ఈ డిసెంబర్ 2న రిలీజ్ అయ్యి ఈ సెన్సేషనల్ కాంబోకి ఉన్న పవర్ ని చూపించింది. అయితే ఈసారి మాత్రం బాలయ్య ఓవర్సీస్ మార్కెట్ లో కూడా తన హవా చూపించాడు. ప్రీమియర్స్ నుంచే తన గత సినిమాల్లో ఏ సినిమాకి రాని రెస్పాన్స్ ని కొల్లగొట్టి దుమ్ము లేపాడు.

మరి ప్రతి రోజు కూడా స్ట్రాంగ్ స్టాండర్డ్ ని అక్కడి బాక్సాఫీస్ దగ్గర కూడా చూపించి ఇప్పుడు 1 మిలియన్ మార్క్ ని అందుకొని ఈ ఏడాది అక్కడ మరో బిగ్ బ్లాక్ బస్టర్ గా సెట్ చేసాడు. ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించగా థమన్ సంగీతం అందించాడు. అలాగే ద్వారకా క్రియేషన్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :