రీరిలీజ్ కి రెడీ అవుతున్న బాలయ్య “భైరవ ద్వీపం”.!

Published on May 26, 2023 9:00 am IST

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ అంటే చాలా మందికి మంచి మాస్ ముందుగా గుర్తొస్తుంది. కానీ బాలయ్య మాస్ తో పాటుగా ఎప్పటికప్పుడు కాస్త కొత్త ప్రయోగాలు చేయడంలో కూడా ఎప్పుడూ ముందుంటారు. అలా తాను చేసిన ఎన్నో సాహసోపేత ప్రయత్నాల్లో తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అయ్యినటువంటి కల్ట్ క్లాసిక్ చిత్రం “భైరవ ద్వీపం” కూడా ఒకటి.

ప్రముఖ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు అద్భుత సృష్టిలో ఒక చిత్రంగా వచ్చిన ఈ ఫాంటసీ థ్రిల్లర్ అయితే ఇప్పుడు 4K లో రీరిలీజ్ కి సిద్ధం అవుతున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ చిత్రాన్ని బాలయ్య బర్త్ డే కానుకగా అయితే ఈ జూన్ 10న రిలీజ్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. మరి ఇప్పటికీ టీవీల్లో వస్తే ఈ సినిమాని ఆడియెన్స్ ఎంతో ఇష్టంగా చూస్తారు. మరి ఇలాంటి సినిమాని బిగ్ స్క్రీన్స్ పై చూడాలి అనుకునేవారికి మాత్రం ఇది మంచి ఛాన్స్ అని చెప్పొచ్చు.

సంబంధిత సమాచారం :