బాలకృష్ణ లవ్ ట్రాక్ ఆసక్తికరంగా ఉంటుందట !


బాలకృష్ణ 101వ చిత్రం ‘పైసా వసూల్’ రేపు భారీ ఎత్తున రిలీజ్ కానుంది. బాలయ్యే 100 సినిమాలు చేసిన తనకు ఈ చిత్రం రీలాంచ్ వంటిదని చెబుతున్న ఈ చిత్రం పట్ల ప్రేక్షకుల్లో తారాస్థాయి అంచనాలున్నాయి. మరీ ముఖ్యంగా టీజర్, ట్రైలర్లలో కనిపించిన కొత్త బాలకృష్ణ సినిమాలో ఎలా ఉంటాడో చూడాలనే కుతూహలం అందరిలోనూ ఉంది. అంతేగాక ఈ సినిమాలో బాలయ్య లవ్ ట్రాక్ కూడా ఆసక్తికరంగా ఉంటుందనే టాక్ వినిపిస్తోంది.

ఈ మెచ్యూర్డ్ లవ్ ట్రాక్ కొత్తగా ఉంటుందని, మంచి వినోదాన్ని ఇస్తుందని అంటున్నారు. ఇప్పటికే బాలకృష్ణతో రెండు సినిమాల్లో కలిసి నటించిన బాలకృష్ణ , శ్రియలకు ఇది మూడవ సినిమా కావడం విశేషం. మరి ఈసారి ఈ ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్టైనర్లో వీళ్ళ కెమిస్ట్రీ ఎంతగా పండిందో చూడలంటే రేపటి వరకు ఆగాల్సిందే. భవ్య క్రియేషన్స్ నిర్మించిన ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.