అభిమానులకు దసరా కానుక ఇవ్వనున్న బాలకృష్ణ

Gautamiputra-Satakarni

ప్రతిష్టాత్మకమైన నందమూరి బాలకృష్ణ 100వ చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ప్రస్తుతం మధ్యప్రదేశ్ లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ షెడ్యూల్లో ముఖ్య తారాగణం బాలకృష్ణ, హేమ మాలిని, శ్రియ శరన్ లపై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరగనుంది. అలాగే కొన్ని యాక్షన్ సీక్వెన్స్ లను కూడా ఇక్కడే చిత్రీకరిస్తున్నారు. బాలయ్య 100వ సినిమా కావడంతో దీనిపై నందమూరి అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి.

దర్శకుడు క్రిష్ కూడా ఈ అంచనాలను అందుకునేలా చిత్రాన్ని గొప్పగా రూపొందిస్తున్నారు. ఇకపోతే అభిమానులకు కానుకగా దసరా రోజున ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చేయనున్నారు. ఈ చిత్రం రెండవ శతాబ్దపు రాజు గౌతమీపుత్ర శాతకర్ణి జీవితం ఆధారంగా తెరకెక్కతోంది.h ఇందులో బాలకృష్ణ తల్లిగా హేమ మాలిని నటిస్తుండగా, శ్రియ విశిష్టి దేవి పాత్రలో బాలకృష్ణకు భార్యగా నటించనుంది. చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని 2017 సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు.