“అఖండ” కీలక వర్క్ స్టార్ట్ చేసేసిన బాలయ్య!

Published on Sep 2, 2021 10:47 am IST


నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మరియు మోస్ట్ అవైటెడ్ చిత్రం “అఖండ”. తన హ్యాట్రిక్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో ప్లాన్ చేసిన ఈ చిత్రం ఇప్పుడు లాస్ట్ స్టేజ్ షూట్ లో ఉంది. మరి భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రంలో బాలయ్య కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో పాటుగా అత్యధిక బిజినెస్ ని కూడా జరుపుకొని సన్నద్ధం అవుతుంది.

మరి ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం బాలయ్య ఇప్పుడు ఈ సినిమా కోసం కీలక వర్క్ ని స్టార్ట్ చేసేసినట్టుగా తెలుస్తుంది. అదే ఈ సినిమా డబ్బింగ్ కోసం.. వీరి కాంబో అంటేనే పవర్ డైలాగ్స్ తో సినిమా అంతా నిండిపోయి ఉంటుంది. మరి ఇప్పుడు డబ్బింగ్ లో బాలయ్య ఎలాంటి డైలాగ్స్ పలికించారో ఊహించొచ్చు.. మరి ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించగా థమన్ సంగీతం అందించాడు. అలాగే ఈ చిత్రాన్ని ద్వారకా క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

సంబంధిత సమాచారం :