బాలయ్య సంచలన నిర్ణయం..అలా చెయ్యకుంటే రాజీనామా.!

Published on Feb 4, 2022 2:45 pm IST


గత ఏడాది టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర వచ్చి భారీ హిట్ గా నిలిచిన చిత్రాల్లో నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన చిత్ర “అఖండ” కూడా ఒకటి. దర్శకుడు బోయపాటి శ్రీను తో చేసిన ఈ భారీ సినిమా అంచనాలను మించి హిట్ అవ్వగా అక్కడ నుంచి బాలయ్య సినిమాల పరంగా మంచి బిజీగా మారారు.

అయితే ఇప్పుడు తన సినిమాలతో పాటుగా బాలయ్య తన రాజకీయ కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొనడం జరుగుతుంది. మరి ఇందులో భాగంగా తన నియోజకవర్గం హిందూపురం విషయంలో బాలయ్య పలు సంచలన కామెంట్స్ చెయ్యడం ఆసక్తిగా మారింది. ఇటీవల ఏపీ ప్రభుత్వం కొత్త జిల్లాలను ప్రకటిస్తూ ఒక కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

మరి నిర్ణయం పట్ల బాలయ్య తన హిందూపురం ని కూడా జిల్లాగా మార్చాలని డిమాండ్ చేస్తూ మౌన దీక్ష వహించారు. అంతే కాకుండా దానికి సత్య సాయి జిల్లాగా పేరు పెట్టాలని డిమాండ్ చెయ్యడమే కాకుండా హిందూపురం ని జిల్లా కేంద్రంగా ప్రకటించకపోతే రాజీనామా కూడా చేస్తానని దీక్ష ప్రారంభించే ముందు చెప్పి సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీనితో బాలయ్య ఈ హిట్ కామెంట్స్ ఇండస్ట్రీ వర్గాలు మరియు రాజకీయ వర్గాల్లో మరింత వేడిని పుట్టించాయి.

సంబంధిత సమాచారం :