క్రాకింగ్ మాస్ కాంబోని హోస్ట్ చెయ్యబోతున్న బాలయ్య.!

Published on Dec 19, 2021 12:00 pm IST

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా “అఖండ” సినిమా రిలీజ్ అయ్యి బిగ్ బ్లాక్ బస్టర్ అయ్యిన సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా ఇచ్చిన బూస్టప్ తో బాలయ్య మళ్ళీ తన మొట్టమొదటి ఓటిటి షో అయినటువంటి “అన్ స్టాప్పబుల్” లో ఇప్పటివరకు చాలా మంది టాలీవుడ్ బిగ్ స్టార్స్ ని తనదైన శైలి హోస్టింగ్ తో డీల్ చేసారు. ఇక ఇప్పుడు ఈ షోలో ఆరవ ఎపిసోడ్ గా ఒక పవర్ ఫుల్ మాస్ కాంబోని హోస్ట్ చెయ్యడానికి రెడీ అయ్యారు.

వారే మన టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ మరియు ఈ ఏడాది మాస్ మహారాజ్ తో “క్రాక్” సినిమా తో హిట్ అందుకున్న దర్శకుడు గోపీచంద్ మలినేని లతో చేయనున్నారు. ఇప్పుడు ఈ ఎపిసోడ్ కి చెందిన ఫొటోలే మంచి వైరల్ అవుతున్నాయి. “ఆహా” లో ఈ మాస్ క్రాకింగ్ ఎపిసోడ్ కూడా త్వరలోనే టెలికాస్ట్ కానుంది. మరి ఈ తర్వాతనే బాలయ్య మరియు గోపీచంద్ మలినేని కాంబోలో ఓ మాసివ్ ప్రాజెక్ట్ చేయనున్న సంగతి అందరికీ తెలిసిందే.

సంబంధిత సమాచారం :