ఆ స్టార్ హీరో కోసం రెండు పనులు చేయనున్న బాలకృష్ణ ?

28th, June 2017 - 12:30:33 PM


ఈ సోమవారం నందమూరి బాలకృష్ణ బెంగుళూరు వెళ్లి శివరాజ్ కుమార్ ను కలిసిన సంగతి తెలిసిందే. మొదటి నుండి రాజ్ కుమార్ కుటుంబంతో మంచి సాన్నిహిత్యం కలిగిన బాలకృష్ణ కొద్దిరోజుల క్రితమే శివరాజ్ కుమార్ తల్లి పర్వతమ్మ మరణించడంతో వారిని పరమర్శించేందుకు అక్కడకు వెళ్లారు. శివరాజ్ కుమార్ తో పాటు పునీత్ రాజ్ కుమార్, వారి మరొక సోదరుడు రాఘవేంద్ర రాజ్ కుమార్ ను కూడా బాలకృష్ణ కలిశారు.

ఈ సమావేశంలో శివరాజ్ కుమార్ తన సినిమా ‘మాస్ లీడర్’ యొక్క ఆడియో వేడుకకు ముఖ్య అతిధిగా రమ్మని బాలకృష్ణను ఆహ్వానించారట. ఆ వేడుకలోనే ఆయన మరొక చిత్రం ‘తగరు’ టీజర్ ను కూడా బాలయ్య చేత లాంచ్ చేయించే ఆలోచనలో శివరాజ్ కుమార్ ఉన్నట్లు వినికిడి. వ్యక్తిగతంగా శివరాజ్ కుమార్ కు మంచి స్నేహితుడైన బాలకృష్ణ ఆయన కోసం ఆడియో వేడుకకు వెళ్లే ఆస్కారాలు ఎక్కువగానే ఉన్నాయి.