ఎన్టీఆర్ సినిమా సంగతిని తేల్చేయనున్న బాలయ్య !


మహానటుడు నందమూరి తారకరామారావుగారి జీవితాన్ని సినిమాగా రూపొందిస్తానని ఆయన తనయుడు, హీరో బాలకృష్ణ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఎన్నో విశేషాలు, కోణాలు కలిగిన ఆయన జీవితాన్ని ఎవరు తెర మీద ఆవిష్కరిస్తారు అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. గతంలో రామ్ గోపాల్ వర్మ ఆ సినిమాను డైరెక్ట్ చేస్తారని వార్తలొచ్చినా వాటిలో నిజం లేదని తేలిపోయింది.

తాజాగా ‘పైసా వసూల్’ ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమా ప్రస్తావన రాగానే ఇంకో రెండ్ మూడు రోజుల్లో సినిమాను ఫైనల్ చేస్తానని బాలకృష్ణ తెలిపారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని, అది పూర్తవగానే సినిమాను లాంచ్ చేస్తానని అన్నారు. అలాగే ఈ సినిమా ఇన్ పుట్స్ కోసం బాలకృష్ణ రామారావుగారి యొక్క సన్నిహితులు, మిత్రులు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనతో కలిసి పనిచేసినవారితో సంప్రదింపులు జరుపుతున్నారు.