శంకరపల్లిలో మహేష్ బాబు షూటింగ్ !

8th, January 2018 - 04:43:32 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవలే హాలీడే నుండి తిరిగొచ్చి ‘భరత్ అనే నేను’ షూటింగ్ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఈరోజు నుండే ఈ కొత్త షెడ్యూల్ ప్రారంభమైంది. హైదరాబాద్ శివార్లలోని శంకరపల్లి ఏరియాలో షూటింగ్ జరుగుతోంది. మహేష్ బాబుతో పాటు కొందరు ఇతర నటీ నటులపై సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు.

అలాగే ఈ షెడ్యూల్లో హీరోయిన్ కైరా అద్వానీ కూడా పాల్గొననుంది. మరోవైపు సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చే పనిలో బిజీగా ఉన్నారు. మహేష్, కొరటాల సేవలు కలిసి చేస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. ఈ వేసవికి రిలీజ్ కానున్న ఈ చిత్రాన్ని ప్రముఖహ్ నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్నారు.