బండ్ల గణేశ్ “డేగల బాబ్జీ”కి రిలీజ్ డేట్ ఫిక్స్..!

Published on May 4, 2022 2:37 am IST

ప్రముఖ నిర్మాత, కమెడీయన్ బండ్ల గణేశ్ తొలిసారి హీరోగా “డేగల బాబ్జీ” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళంలో సూపర్ హిట్ సాధించిన ‘ఒత్త సెరప్పు అళవు-7’కి రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వెంకట్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన ప్రచార చిత్రాలు, వీడియోలకు ప్రేక్షకుల నుంచి మంచి రెసాన్స్ వచ్చింది.

అయితే ఈ సినిమా నుంచి రంజాన్‌ సందర్భంగా ఓ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాని మే 20న రిలీజ్‌ చేస్తున్నట్లు చిత్రయూనిట్‌ ప్రకటించింది. ఈ మేరకు బండ్ల గణేష్‌ ‘నవరసాలతో మీ డేగల బాబ్జీ’ అంటూ రిలీజ్‌ డేట్‌తో కూడిన ఓ పోస్టర్‌ను ట్విటర్‌లో షేర్‌ చేశాడు. రిషి అగస్త్య సమర్పణలో యష్ రిషి ఫిలిమ్స్ పతాకంపై స్వాతి చంద్ర ఈ చిత్రాన్ని నిర్మించారు.

సంబంధిత సమాచారం :