పవన్ ప్రాజెక్ట్ పై ఎగ్జైటెడ్ గా బండ్ల..టైటిల్ వరకు.!

Published on Jul 18, 2021 11:52 am IST

మన టాలీవుడ్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న మాస్ హీరోస్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ది ప్రత్యేక స్థానం. ఒక్క సాధారణ అభిమానుల్లోనే కాకుండా ఇండస్ట్రీ వర్గాల్లో కూడా చాలా మేర పవన్ అభిమానులు కనిపిస్తారు. డాన్స్ కొరియోగ్రాఫర్స్, కమెడియన్స్ నుంచి స్టార్ దర్శకులు ప్రొడ్యూసర్స్ లలో కూడా పవన్ కి అభిమానులు సొంతం. మరి వారందిరిలో సూపర్ స్పెషల్ ఫ్యాన్ ఎవరన్నా ఉన్నారు అంటే అది ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ అని చెప్పాలి.

పవన్ పై తనకున్న అభిమానం చెప్పుకున్న సందర్భాలు కోకొల్లలు. అయితే గబ్బర్ సింగ్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత మళ్ళీ కాంబో నుంచి సినిమా కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా బండ్ల ఆల్రెడీ పవన్ ని సినిమాకి ఒప్పించేసారు. కానీ ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్ గా చిత్రం పట్టాలెక్కాల్సి ఉంది. అయితే సోషల్ మీడియాలో రెగ్యులర్ గా టచ్ లో ఉండే బండ్ల ఈ సినిమాపై ఎంత ఎగ్జైటింగ్ ఉన్నారో తన స్పందన చూస్తే అర్ధం అవుతుంది.

తాను పవన్ ఎప్పుడు సినిమా స్టార్ట్ చేద్దాం అంటే అప్పుడే రెడీ అని అంతా పవన్ చేతిలోనే ఉందని తెలుపుతున్నారు. అలాగే ఈ సినిమాకి టైటిల్ పై కూడా హింట్ ఇస్తున్నారు. పవన్ తనకి “దేవర” లాంటి వారని ఇటీవల చెప్పడం వైరల్ అయ్యింది. దీనితో అభిమానుల కోరిక మేరకు అదే టైటిల్ ని కూడా రిజిస్టర్ చేసే అవకాశం కూడా ఉందని తెలుస్తుంది. అయితే తాను సోషల్ మీడియాలో ఎగ్జైట్మెంట్ లో అనుండొచ్చేమో కానీ అదే టైటిల్ ని తమ ప్రాజెక్ట్ కి ఫిక్స్ చేస్తారా లేదా అన్నది కాలమే నిర్ణయించాలి.

సంబంధిత సమాచారం :