బండ్ల గణేశ్‌కి ఇష్టమైన వారి లిస్ట్‌లో పవన్‌కి దక్కని చోటు..!

Published on Dec 10, 2021 10:30 pm IST


‘బండ్ల గణేశ్’ మనందరికి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. కమెడియన్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి, ఆ తర్వాత నిర్మాతగా మారిపోయాడు. మధ్యలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినా అక్కడ ఎక్కువ రోజులు ఉండలేకపోయాడు. కాంట్రవర్సీ కామెంట్స్ మధ్య నలిగిపోయి తిరిగి సినిమాల్లోకి వచ్చేశాడు. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే బండ్ల గణేశ్ తాజాగా ఓ ట్వీట్ చేశాడు.

‘నాకు తెలిసిన నాకిష్టమైన తెలుగు జాతిరత్నాలు వీరే అంటూ 8 మంది ఫోటోలను షేర్ చేశాడు. అందులో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, రామోజీరావు, సీజేఐ ఎన్వీ రమణ, మెగాస్టార్ చిరంజీవి, స్వర్గీయ నందమూరి తారకరామారావు, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, తెలంగాణ సీఎం కేసీఆర్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉన్నారు. అయితే ఇంత మంది ఇష్టమని చెప్పిన బండ్ల గణేశ్ అతడు దేవుడిగా పిలుచుకునే పవన్ కళ్యాణ్‌కి మాత్రం ఈ లిస్ట్‌లో ప్లేస్ కల్పించకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇదిలా ఉంటే బండ్ల గణేష్ తొలిసారి హీరోగా “డేగల బాబ్జీ’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :