రాజకీయాలపై తుది క్లారిటీ ఇచ్చిన బండ్ల గణేష్.!

రాజకీయాలపై తుది క్లారిటీ ఇచ్చిన బండ్ల గణేష్.!

Published on Oct 30, 2022 7:59 AM IST

టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాత అలాగే నటుడు అయినటువంటి బండ్ల గణేష్ కోసం అందరికీ తెలిసిందే. మరి బండ్ల గణేష్ అయితే ఇప్పుడు పలు ఇంటర్వ్యూ లు అలాగే సోషల్ మీడియాలో మరియు తన పర్శనల్ లైఫ్ లో మాత్రమే యాక్టీవ్ గా కనిపిస్తున్నారు. ఇక ఇదిలా ఉండగా గతంలో అయితే రాజకీయాల్లో తాను బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కానీ తర్వాత మళ్ళీ వాటికి అయితే తాను దూరం అయ్యారు. అయితే మళ్ళీ బండ్ల పొలిటికల్ రీ ఎంట్రీ పై కొన్ని రూమర్స్ స్టార్ట్ కాగా తాను అయితే ఇప్పుడు వీటిపై క్లారిటీ ఇచ్చేసారు.

“నమస్కారం.. నా కుటుంబ బాధ్యతల వల్ల నా ఉమ్మడి కుటుంబ సభ్యుల నేపథ్యంలో.. వారి కోరికపై మా పిల్లల భవిష్యత్ గురించి ఆలోచిస్తూ నాకున్న పనులు వల్ల వ్యాపారాల వల్ల నేను రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. నాకు ఏ రాజకీయ పార్టీతో శత్రుత్వం గానీ, మిత్రుత్వం గానీ లేదు” అని తాను దీనిపై అయితే తుది క్లారిటీ ఇచ్చారు. గతంలో కూడా బండ్ల తన ఆరాధ్య దైవం పవన్ కళ్యాణ్ పార్టీలో చేరుతారని పలు వార్తలు వచ్చాయి. కానీ ఫైనల్ గా అయితే తాను ఈ రకంగా ముగించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు