డైరెక్టర్ హరీశ్ శంకర్‌కి ఖరీదైన వాచ్‌ను బహుమతిగా ఇచ్చిన బండ్ల గణేశ్..!

Published on May 12, 2022 1:00 am IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, శృతిహాసన్ హీరోయిన్‌గా హరీశ్ శంకర్‌ దర్శకత్వంలో 2011 మే 11న వచ్చిన “గబ్బర్ సింగ్” సినిమా ఎంతటి ఘన విజయాన్ని దక్కించుకుందో అందరికీ తెలిసిందే. ఈ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాను ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్ నిర్మించారు. అయితే ఈ హిట్ సినిమా విడుదలై నేటికి 10 సంవత్సరాలు పూర్తయ్యింది.

ఈ సందర్భంగా నిర్మాత బండ్ల గణేశ్ డైరెక్టర్ హరీశ్ శంకర్‌కి ఖరీదైన బహుమతిని ఇచ్చాడు. దాదాపు రూ.5 లక్షల విలువ చేసే ఓమెగ శేమస్తెర్ అనే లగ్జరీ వాచ్‌ని ఇచ్చాడు. అంతేకాదు స్వయంగా బండ్ల గణేశ్ ఆ వాచ్‌ని హరీశ్ శంకర్ చేతికి పెట్టాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

సంబంధిత సమాచారం :