తన ప్యానల్ పై అంతా మీ ఇష్టం అంటున్న బండ్ల గణేష్.!

Published on Sep 25, 2021 9:00 am IST

టాలీవుడ్ ప్రముఖ నటుడు సహా నిర్మాత అయినటువంటి బండ్ల గణేష్ కోసం అందరికీ తెలిసిందే. ఓ పక్క నిర్మాతగానే కాకుండా ఇప్పుడు హీరోగా కూడా రెడీ అవుతున్నారు.. అయితే ఇదిలా ఉండగా ఇప్పుడు టాలీవుడ్ లో మా ఎన్నికల హీట్ మొదలు కాగా బండ్ల గణేష్ మొదట నటుడు ప్రకాష్ రాజ్ ప్యానల్ కి మద్దతుగా నిలబడి తర్వాత తాను వేరేగా చేస్తున్నాను అందరి ఆశీర్వాదం కావాలని కోరారు.

మరి ఇటీవల మంచు విష్ణు తన ప్యానల్ సభ్యులని ప్రకటించగా బండ్ల గణేష్ కూడా నిన్న తన ప్యానల్ పై ఆసక్తికర ప్రకటన చెయ్యడం జరిగింది. మరి తన ప్యానల్ పై తాను జనరల్ సెక్రటరీగా పెట్టి మిగతా సభ్యుల అందరి ఫోటోస్ లో మీ ఇష్టం, మీ ఇష్టం అని పొందుపరిచారు.

దీనితో ఈ కొత్త రకం ప్రకటన చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా తన ప్యానల్ విషయంపై అందరి చాలా మంది నటుల్ని ట్యాగ్ చేసుకుంటూ బండ్ల వెళ్లిపోతున్నారు. మరి మీ ఇష్టం అని చెప్పిన వాటిలో కనిపించే సినీ ప్రముఖులు ఎవరు అన్నది వేచి చూడాలి.

సంబంధిత సమాచారం :