మెగాస్టార్ చిరంజీవి పై బండ్ల గణేష్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Published on Sep 20, 2021 12:02 am IST

మెగా ఫ్యామిలీ పై బండ్ల గణేష్ కి ఉన్న అభిమానం మాటల్లో చెప్పలేం. మెగాస్టార్ చిరంజీవి పై బండ్ల గణేష్ మరొకసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మిమ్మల్ని చూస్తుంటే మీరు ముందు పుట్టి, సంస్కారం తర్వాత పుట్టిన అంతా ఆనందం అనిపిస్తుంది సార్ అంటూ మెగాస్టార్ చిరంజీవి పై ప్రశంసల వర్షం కురిపించారు.

హైదరాబాద్ లో జరుగుతున్న లవ్ స్టోరీ ప్రీ రిలీజ్ వేడుక కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ మేరకు సినీ పరిశ్రమ పై, రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన సహాయం పై తనదైన శైలి లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడారు. చిరు చేసిన వ్యాఖ్యల పట్ల అభిమానులు, ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు బండ్ల గణేష్ సైతం సోషల్ మీడియా ద్వారా స్పందించడం జరిగింది. బండ్ల గణేష్ ఇప్పటి వరకు నటుడు గా, నిర్మాత పా సినిమాలకు పని చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే డేగల బాబ్జి పేరిట హీరోగా బండ్ల గణేష్ నటించనున్నారు. వెంకట్ చంద్ర ఈ సినిమా కి దర్శకత్వం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :