షూటింగ్ షురూ చేసుకున్న బండ్ల గణేశ్ సినిమా..!

షూటింగ్ షురూ చేసుకున్న బండ్ల గణేశ్ సినిమా..!

Published on Sep 4, 2021 7:32 PM IST

ప్రముఖ నిర్మాత, కమెడీయన్ బండ్ల గణేష్ హీరోగా పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. వెంకట్ చంద్రను దర్శకుడిగా పరిచయం చేస్తూ, రిషి అగస్త్య సమర్పణలో యష్ రిషి ఫిలిమ్స్ పతాకంపై స్వాతి చంద్ర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవలే ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

ఈ సందర్భంగా దర్శక-నిర్మాతలు మాట్లాడుతూ తమిళ హిట్ ‘ఒత్తు సెరుప్పు సైజ్ 7’కి‌ రీమేక్ ఇది అని, తమిళంలో ఆర్. పార్తిబన్ గారు పోషించిన పాత్రను తెలుగులో బండ్ల గణేష్ చేస్తున్నారని అన్నారు. అయితే ఈ పాత్ర కోసం ఆయన పత్యేకంగా మేకోవర్ అయ్యారని, ఆయన లుక్, యాక్టింగ్ అందరికీ సర్‌ప్రైజ్ ఇస్తుందని, సింగిల్ షెడ్యూల్‌లో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయాలని భావిస్తున్నట్టు తెలిపారు. ఇదిలా ఉంటే ‘ఒత్తు సెరుప్పు సైజ్ 7’ను హిందీలో అభిషేక్ బచ్చన్ హీరోగా రీమేక్ చేస్తున్నారు.‌ చెన్నైలో ఆ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు