“భీమ్లా” కి మిస్సయినా ఈసారి పవన్ మీటింగ్ లో కనిపించనున్న బండ్ల.!

Published on Mar 13, 2022 10:00 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న కల్ట్ ఫ్యాన్స్ లో టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా చాలా మంది ఉన్నారు. దర్శకులు, హీరోల్లోనే కాకుండా నిర్మతలు ఆర్టిస్ట్స్ ఇలా అందరి లోని పవన్ కి అభిమానులు ఉన్నారు. అయితే ఈ అందరిలో పవన్ కి వీరాభిమానిగా అందులో పవన్ అభిమానుల్లో తనకి కూడా ప్రత్యేక క్రేజ్ ఏర్పర్చుకున్న వ్యక్తి మాత్రం ప్రముఖ నిర్మాతా బండ్ల గణేష్ అని చెప్పాలి.

పవన్ సినిమాకి సంబంధించి ఏదన్నా సినిమా మీటింగ్ అయితే పవన్ తో పాటు బండ్ల గణేష్ స్పీచ్ కోసం కూడా ఆ రేంజ్ లో ఎదురు చూస్తున్నారు. అయితే లాస్ట్ టైం “భీమ్లా నాయక్” వేడుకలో బండ్ల స్పీచ్ ని చాలా మందే మిస్సయ్యారు. కానీ ఈసారి మాత్రం మొత్తానికి పవన్ మీటింగ్ లో తాను కనిపిస్తానని లేటెస్ట్ గా కన్ఫర్మ్ చేసి పవన్ ఫ్యాన్స్ లో మళ్ళీ కొత్త ఉత్సాహాన్ని అందించాడు.

ఈ మార్చ్ 14 న పవన్ తన పార్టీ జనసేన ఆవిర్భావ దినోత్సవ భారీ మీటింగ్ కి తాను కూడా వస్తున్నానని చెప్పి కన్ఫర్మ్ చేశారు. మరి ఈ మీటింగ్ లో కేవలం అభిమానిగా వెళ్తున్నాడా లేక స్టేజ్ ఎక్కి పవన్ ఫ్యాన్స్ మిస్సవుతున్న మాస్ స్పీచ్ కూడా వదులుతాడేమో చూడాలి.

సంబంధిత సమాచారం :