రాజకీయాలపై బండ్ల గణేష్ సంచలన పోస్ట్.!

రాజకీయాలపై బండ్ల గణేష్ సంచలన పోస్ట్.!

Published on Nov 29, 2022 1:00 PM IST

మన టాలీవుడ్ ప్రముఖ నటులు మరియు నిర్మాతలలో బండ్ల గణేష్ కూడా ఒకరు. మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో బండ్ల గణేష్ అంటే తెలియవు వారు ఎవరూ ఉండరు. మరి సినిమాలతో పాటుగా రాజకీయాల్లో కూడా తన ముద్ర వేసిన బండ్ల ఇప్పుడు రెండిటికీ కూడా కాస్త దూరం గానే ఉన్నారు. ఇక లేటెస్ట్ గా అయితే రాజకీయాల విషయంలో మాత్రం తాను మరింత దూరంగా ఉండనున్నట్టుగా ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యింది అని చెప్పాలి.

సోషల్ మీడియాలో తాను మాట్లాడుతూ “రాజకీయాల వలన జీవితంలో చాలా నష్టపోయాను నాకు ఏ రాజకీయాలతో ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు అందరూ ఆత్మీయులే” అని స్పష్టం చేశారు. అయితే ఇందులో తన ఆరాధ్య దైవం పవన్ కూడా అతీతం కాదు అన్నట్టే స్పష్టం చేయడం విశేషం. దీనితో బండ్ల గణేష్ అయితే తన రాజకీయాల విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నట్టే అనిపిస్తుంది. కొన్నాళ్ల వరకు అయితే పవన్ కి మాత్రమే సపోర్ట్ చేస్తున్నట్టు అనిపించినా బండ్ల ఇప్పుడు ఈ తరహాలో స్పందన వ్యక్తం చేయడం కొందరు పవన్ ఫ్యాన్స్ కి ఆశ్చర్యం కలిగిస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు