లేటెస్ట్..పోటీకి రెడీ అంటూ ట్విస్ట్ ఇచ్చిన బండ్ల గణేష్..!

Published on Sep 5, 2021 3:33 pm IST


మన టాలీవుడ్ బ్లాక్ బూస్ట్ నిర్మాత బండ్ల గణేష్ అంతకు ముందు ఒక నటునిగా తర్వాత నిర్మాతగా పర్సనల్ లైఫ్ లో ఓ బిజినెస్ మెన్ గా కూడా అందరికీ తెలుసు. అలాగే ఈ కరోనా కష్ట కాలంలో అనేక మందికి తన వంతు సాయాన్ని కూడా అందిస్తూ ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గానే కనిపిస్తున్నారు. మరి మరోపక్క టాలీవుడ్ లో హీరోగా కూడా ఎంట్రీ ఇచ్చేందుకు బండ్ల గణేష్ ఇప్పుడు తాను తీసుకున్న షాకింగ్ నిర్ణయాన్ని వెల్లడించారు.

గత కొంత కాలం నుంచి టాలీవుడ్ లో జరగనున్న “మా”(మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికల్లో తాను కూడా పోటీ చెయ్యడానికి సిద్ధంగా ఉన్నానని బండ్ల గణేష్ తెలిపారు. “మనస్సాక్షికి ఎంతచెప్పినా మాట వినడం లేదు-నన్ను పోటీ చెయ్ అంటోంది -అందుకే ఈ పోటీ అందరికీ అవకాశం ఇచ్చారు ఒకే ఒక అవకాశం నాకివ్వండి నేనేంటో చూపిస్తా..” అంటూ తనదైన శైలి ట్వీట్ పెట్టారు.

అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే గత కొన్నాళ్ల కితమే ప్యానల్ లో పోటీకి రెడీ అయ్యిన ప్రకాష్ రాజ్ కి సంపూర్ణ మద్దతుగా నిలిచిన బండ్ల గణేష్ ఇప్పుడు తానే పోటీ చేస్తా అనడం ఆసక్తిగా మారింది. మరి ఇప్పుడు ఈ ఊహించని ట్విస్ట్ ఎలాంటి మలుపులకి దారి తీస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :