మెగాస్టార్ వ్యాఖ్యల పై బండ్ల గణేష్ ట్వీట్ !

Published on Jan 2, 2022 5:30 pm IST

‘తెలుగు సినిమా ఇండస్ట్రీకి తాను పెద్దగా ఉండటం లేదు అని, పెద్ద అనే హోదా తనకిష్టం లేదని మెగాస్టార్ చిరంజీవి తాజాగా చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అయితే, ఈ వ్యాఖ్యల పై నిర్మాత బండ్లగణేశ్‌ తనదైన శైలిలో స్పందించాడు. మెగాస్టార్ వ్యాఖ్యలను మెచ్చుకుంటూ ట్విటర్‌ వేదికగా బండ్ల్ గణేష్ ఒక మెసేజ్ ను పోస్ట్ చేశాడు. ‘సూపర్‌ సర్‌.. బాగా చెప్పారు’ అని బండ్ల ట్వీట్ చేశాడు.

మరి, పవర్ స్టార్ ప‌వ‌న్ కళ్యాణ్ ను బండ్ల గ‌ణేష్ ఎట్టకేలకూ తన నిర్మాణంలో ఓ సినిమా చేయడానికి ఒప్పించిన సంగతి తెలిసిందే. అయితే ప‌వ‌న్ కళ్యాణ్ కోసం బండ్ల గ‌ణేష్ ప్రస్తుతం ఓ కథను వెతికే పనిలో ఉన్నాడు. ఈ క్రమంలో పూరి – పవన్ కాంబినేషన్ ను సెట్ చేసే ఆలోచనలో ఉన్నాడు బండ్ల. మరి మంచి కథ దొరికితే, అది పవన్ కు నచ్చితే.. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది నుండి పూరి డైరెక్షన్ లో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం :