వైరల్ : మెగాస్టార్ స్టైల్‌ పై బండ్ల గణేష్‌ క్రేజీ పోస్ట్ లు !

వైరల్ : మెగాస్టార్ స్టైల్‌ పై బండ్ల గణేష్‌ క్రేజీ పోస్ట్ లు !

Published on Aug 8, 2022 4:05 PM IST

మెగా ఫ్యామిలీకి అభిమానుల రూపంలో ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నా సరే.. వారందరికంటే కూడా తానే పవర్ ఫుల్ ఫ్యాన్ అని బలంగా చెప్పుకుంటుంటాడు బండ్ల గ‌ణేష్. నటుడిగా, నిర్మాతగా తనదైన ముద్రను వేసుకున్న బండ్ల గణేష్‌ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటారు. పైగా మెగా ఫ్యామిలీ పై తనకున్న ప్రత్యేకమైన అభిమానాన్ని బండ్ల ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూనే ఉన్నాడు.

తాజాగా బండ్ల గణేష్‌, మెగాస్టార్ స్టైల్‌ గురించి చేసిన ట్వీట్‌ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇంతకీ బండ్ల గణేశ్‌ ట్వీట్‌ లో ఏం పోస్ట్ చేశాడో చూడండి.

‘‘ఈ స్టైల్‌ చూసే మీ మీద ప్రేమ పెంచుకున్నాం..
ఈ స్టైల్‌ చూసే మేం సినిమా రంగం వైపు పరుగులు తీశాం..
ఈ స్టైల్‌ చూసే మా జీవితాలకు సినిమా రంగం అనేది ఒకటుంటుంది..
ఇక్కడ ఏమైనా సాధించవచ్చు అనే నమ్మకం కల్పించుకున్నాం.
ఈ స్టైల్‌ చూసే ఇక్కడ ఎవరైనా.. ఏదైనా కావచ్చు అనే నిర్ణయానికి వచ్చాం..
ఈ స్టైల్‌ చూసే అందరం మీకు అభిమానులుగా మారిపోయాం.
మీరు ఎప్పటికి ఈ స్టైల్‌లోనే ఉండాలని మా కోరిక,
ఎందరికో భరోసా.. ఎవరైనా ఈ రంగంలో ఏలవచ్చు అనే నమ్మకం కల్పించిన మీ స్టైల్‌ అంటే మాకు ఇష్టం’’ అని బండ్ల గణేష్‌ పోస్ట్ చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు