వారి సూచన మేరకు జనరల్ సెక్రెటరీ నామినేషన్ ఉపసంహరణ – బండ్ల గణేష్!

Published on Oct 1, 2021 6:04 pm IST

ఈ ఏడాది మా ఎలక్షన్స్ చాలా రసవత్తరం గా మారాయి. ఒక పక్క ప్రకాష్ రాజ్, మరొక పక్క మంచు విష్ణు లు మా అధ్యక్ష పదవి కోసం, మా అసోసియేష్ లో సమస్యల పరిష్కారం కోసం పోటీ చేస్తున్నారు.ప్రధానం గా వీరి మధ్యన గట్టి పోటీ ఉందని చెప్పాలి. అయితే జనరల్ సెక్రెటరీ పదవి కి గానూ బండ్ల గణేష్ నామినేషన్ వేసిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రకాష్ రాజ్ ప్యానెల్ కి ముందుగా మద్దతు ఇచ్చిన బండ్ల గణేష్, ఆ తర్వత జనరల్ సెక్రెటరీ నామినేషన్ వేసి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారిపోయారు.

ప్రస్తుతం ఇప్పుడు ఆ నామినేషన్ ను ఉపసంహరించుకున్నట్లు బండ్ల గణేష్ తెలిపారు. తన దైవ సమానులు, తన ఆత్మీయులు, తన శ్రేయోభిలాషుల సూచన మేరకు తన జనరల్ సెక్రెటరీ నామినేషన్ ను ఉపసంహరించుకున్నట్లు బండ్ల గణేష్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అంతేకాక ఉపసంహరణ కి సంబంధించిన పత్రం ను సైతం పోస్ట్ చేశారు బండ్ల గణేష్. శ్రీకాంత్ మరియు ప్రకాష్ రాజ్ లతో ఫోటో ను షేర్ చేస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు.

సంబంధిత సమాచారం :