డేగల బాబ్జీ గా బండ్ల గణేష్…ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్!

Published on Sep 17, 2021 6:00 pm IST


బండ్ల గణేష్ ఇప్పటి వరకు బ్లాక్ బస్టర్ నిర్మాత గా, నటుడు గా మాత్రమే అందరికీ తెలుసు. ఇప్పుడు హీరో గా మనందరి ముందుకు డేగల బాబ్జీ గా వచ్చేందుకు సిద్దం అయ్యారు. బండ్ల గణేష్ హీరోగా నటిస్తున్న డేగల బాబ్జీ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు హరీష్ శంకర్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేయడం జరిగింది.

టైటిల్ తో పాటుగా ఫస్ట్ లుక్ సైతం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. పోస్టర్ లో బండ్ల గణేష్ సీరియస్ లుక్ లో కనిపిస్తున్నారు. ఈ చిత్రం తమిళం లో సూపర్ హిట్ అయిన ఒత్తు సెరుప్పు సైజ్ 7 కి రీమేక్ అని తెలుస్తుంది. రిషి ఆగస్త్య సమర్పణ లో యశ్ రిషి ఫిలిమ్స్ పతాకంపై ఈ చిత్రాన్ని స్వాతి చంద్ర నిర్మిస్తున్నారు. ఈ సినిమా కి సంబందించిన షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. ఈ చిత్రం తో బండ్ల గణేష్ హీరోగా మెప్పిస్తారో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :