“బంగార్రాజు” నుంచి “బంగార” లిరికల్ సాంగ్ రిలీజ్..!

Published on Jan 9, 2022 1:13 am IST

అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, రమ్య కృష్ణ, కృతి శెట్టిలు ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం “బంగార్రాజు”. ‘సోగ్గాడే చిన్ని నాయన’ చిత్రానికి కొనసాగింపుగా వస్తున్న ఈ చిత్రానికి కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ మరియు జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం దాదాపు ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది.

ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి విడుదలైన ప్రచార చిత్రాలు, వీడియోలు, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమాలోని 4వ పాటగా “బంగార” అనే మాస్ లిరికల్ సాంగ్ రిలీజ్ అయ్యింది. నాగ చైతన్య, కృతిశెట్టి జంటగా అనూప్ రూబెన్స్ కంపోజ్ చేసిన ఈ మాస్ సాంగ్ ప్రస్తుతం ఆకట్టుకుంటుంది.

సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :