డిజిటల్ ప్రీమియర్ కి సిద్ధమైన బంగార్రాజు!

Published on Feb 10, 2022 12:30 am IST

తండ్రీకొడుకులు అక్కినేని నాగార్జున, నాగ చైతన్య కలిసి బంగార్రాజు తో ఘన విజయం సాధించారు. సంక్రాంతికి విడుదలైన ఈ ఫాంటసీ డ్రామా OTT ప్లాట్‌ ఫారమ్‌లోకి ప్రవేశిస్తోంది. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫిబ్రవరి 18, 2022న ZEE5 ప్లాట్‌ఫారమ్‌లో డిజిటల్‌గా అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉందని దాదాపు ధృవీకరించబడింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.

అనూప్ రూబెన్స్ సంగీతం, యువరాజ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ, కృతి శెట్టి కథానాయికలుగా నటించారు. డిజిటల్ ప్రీమియర్ గా వస్తున్న ఈ చిత్రం ఏ తరహా రెస్పాన్స్ ను రాబడుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :