లేటెస్ట్.. “బంగార్రాజు” డే 1 నైజాం వసూళ్ల వివరాలు.!

Published on Jan 15, 2022 10:00 am IST

ఈ ఏడాది సంక్రాంతి పండుగ కానుకగా రిలీజ్ అయ్యిన పండుగ సినిమా “బంగార్రాజు”. అక్కినేని నాగ చైతన్య మరియు నాగార్జున లు హీరోలుగా నాగ్ హిట్ సినిమా సోగ్గాడే చిన్ని నాయన కి సీక్వెల్ గా దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తెరకెక్కించిన ఈ చిత్రం మంచి బజ్ నడుమ రిలీజ్ అయ్యి సంక్రాంతికి మళ్ళీ పర్ఫెక్ట్ సినిమాగా అనిపించుకుంది. అయితే ఈ సినిమాకి సంబంధించి లేటెస్ట్ వసూళ్ల వివరాలు ఇపుడు ఒక్కొక్కటిగా బయటకి వస్తున్నాయి.

అలా నైజాం లో బంగార్రాజు మొదటి రోజు ఎంత షేర్ రాబట్టాడో తెలుస్తుంది. మరి మొదటి రోజు ఈ చిత్రం ఇక్కడ 3.1 కోట్ల గ్రాస్ మరియు 1.73 కోట్ల షేర్ ని రాబట్టింది. ఈ చిత్రానికి మంచి నెంబర్ అని చెప్పాలి. అంతే కాకుండా ఈ పండుగ సీజన్ కూడా బాగా ప్లస్ కావడంతో ఈ వసూళ్లు మరింత మెరుగయ్యే అవకాశం కూడా ఉంది. ఇక ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు.

సంబంధిత సమాచారం :