నైజాంలో డల్ అయ్యిన “బంగార్రాజు” లేటెస్ట్ వసూళ్ల వివరాలు.!

నైజాంలో డల్ అయ్యిన “బంగార్రాజు” లేటెస్ట్ వసూళ్ల వివరాలు.!

Published on Jan 20, 2022 1:00 PM IST

గత ఏడాది టాలీవుడ్ లో అక్కినేని యంగ్ హీరోలు ఇద్దరూ అక్కినేని నాగ చైతన్య మరియు అఖిల్ లు ఇద్దరూ కూడా తమ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ గా “లవ్ స్టోరీ” మరియు “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్” చిత్రాలతో అందుకున్నారు. ఇక ఈ ఏడాది సంక్రాంతి కానుకగా అయితే తండ్రీకొడుకులు అక్కినేని నాగార్జున మరియు నాగ చైతన్య లు “బంగార్రాజు” సినిమాతో వచ్చి మొదటి వారాంతం సాలిడ్ వసూళ్లను అందుకున్నారు.

అయితే వీక్ డేస్ కి వచ్చేసరికి మాత్రం బంగార్రాజుకి టెస్ట్ తప్పలేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా బంగార్రాజు నైజాం లో కాస్త స్లో అయ్యినట్టు తెలుస్తుంది. లేటెస్ట్ గా వచ్చిన వసూళ్లతో అయితే దాదాపు 6 కోట్ల షేర్ మార్క్ ని అక్కడ ఈ చిత్రం క్రాస్ చేసిందట.

అయితే ఈ సినిమా బిజినెస్ కి ఈ మార్క్ కాస్త దూరమే అని తెలుస్తుంది. మరి మళ్ళీ వీకెండ్ కి బంగార్రాజు ఏమన్నా పుంజుకుంటాడా లేదా అనేది చూడాలి. ఇక ఈ సినిమాని కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించగా కృతి శెట్టి, రమ్య కృష్ణ లు హీరోయిన్స్ గా నటించారు. అలాగే అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు